Home / TELANGANA / భారతదేశ అభివృద్ధి ఎజెండా రూపకల్పన జరగాలి..కేసీఆర్

భారతదేశ అభివృద్ధి ఎజెండా రూపకల్పన జరగాలి..కేసీఆర్

అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలు కలిగివున్న భారతదేశానికి అవసరమైన అభివృద్ధి ఎజెండా రూపొందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇప్పుడున్న విధానాలు, పద్దతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు, సంస్కరణల తెచ్చే విషయంపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సీనియర్ అధికారులు మార్గనిర్దేశనం చేయాలని చెప్పారు. ఈ ప్రయత్నంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల వారు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి కావాల్సిన ఎజెండాను రూపొందించడంతో పాటు, ఇప్పుడున్న విధానాల మంచి చెడులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రగతి భవన్ లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సీనియర్ అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, క్రియ స్వచ్ఛంద సంస్థ సిఓవో డాక్టర్ బాలాజి ఊట్ల, పలువురు రిటైర్డ్ అధికారులు, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.

‘‘దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు వచ్చినా అనుకున్న పురోగతి రావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నా, మన దేశంలో ప్రజలు ఇంకా ప్రాథమిక అవసరాలు తీరకుండా ఉన్నారు. చాలా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దేశ ప్రజలందరికీ మంచినీరు అందడం లేదు. విద్యుత్ అందడం లేదు. సాగునీటి సౌకర్యం లేదు. ఇంకా చాలా అవసరాలు తీరడం లేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదు. చాలా రాష్ట్రాల మధ్య జల వివాదాలున్నా, అవి పరిష్కారం కావడం లేదు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా అనేక కమిషన్లు, నిపుణులు సూచించిన సంస్కరణలు అమలు కావడం లేదు. ఫెడరల్ వ్యవస్థ స్పూర్తి పూర్తిస్థాయిలో ప్రతిబింబించడం లేదు. ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి కావాల్సిన ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉంది.

సంక్షేమం, అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అనేక మైలురాళ్లను అధిగమించింది. ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శంగా నిలిచాయి. ఈ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయడంతో పాటు, ఇంకా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కావాల్సిన కార్యక్రమాల రూపకల్పన జరగాలి. దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. ఏ శాఖ ఎవరి వద్ద ఉండాలనేది నిర్ణయం జరగాలి. ఉమ్మడి జాబితా అమలులో ఉండడం వల్ల ఒకేశాఖకు సంబంధించి వేర్వేరు పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక పరిస్థితులున్నాయి. వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ, అధికారం కావాలి. న్యాయవ్యవస్థలోనూ, పాలనా వ్యవస్థలోనూ, శాసన వ్యవస్థలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దేశంలో తీసుకురావాల్సన మార్పులు, సంస్కరణలు, చట్ట సవరణలు, రాజ్యాంగ సవరణలు తదితర అన్ని విషయాల్లో కూడా స్పష్టమైన ఎజెండా రూపొందాలి. ఈ విషయంలో దేశంలోని అధికారులు, రాజకీయ నాయకులు, రిటైర్డ్ అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సూచనలు ఇవ్వాలి. ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat