కామినేని శ్రీనివాస్ పై కత్తి మహేశ్..క‌త్తి లాంటి ట్వీట్..! – Dharuvu
Home / ANDHRAPRADESH / కామినేని శ్రీనివాస్ పై కత్తి మహేశ్..క‌త్తి లాంటి ట్వీట్..!

కామినేని శ్రీనివాస్ పై కత్తి మహేశ్..క‌త్తి లాంటి ట్వీట్..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశాలతో ఏపీ కేబినెట్‌లో తన మంత్రి పదవికి కామినేని శ్రీనివాస్ గురువారం రాజీనామాను చేశారు. ఈ నేపథ్యంలో అతడి రాజీనామాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

see also..బిగ్ బ్రేకింగ్‌: భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి రాజీనామా..!!

అంతేకాదు ప్రత్యేక హోదా విషయంలో వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు కత్తి మహేష్. ఓ ట్వీట్‌లో తన దృష్టిలో ఈ నలుగురే నిజమైన హీరోలంటూ పేర్కోన్నారు. ‘‘సంపూర్ణేష్ బాబు, నిఖిల్ నిజమైన హీరోలు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకూ స్పందించిన శివాజీ, పవన్ కల్యాణ్ మినహా మిగతా ఏ హీరో కూడా నిజ జీవితంలో ప్రజల కోసం కనీసం మాట, ఒక ట్వీట్, ఒక ఉద్యమ అడుగు వెయ్యలేదు. కాబట్టి ప్రస్తుతానికి నా దృష్టిలో ఈ నలుగురే హీరోలు’’ అంటూ ట్వీట్ చేశారు.

see also..వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!