Breaking News
Home / ANDHRAPRADESH / ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?

ప్రముఖ జాతీయ వార్త పత్రిక అయిన టైమ్స్ ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు ..ఏ ప్రాంతాల్లో మెజారిటీ వస్తుందనే అంశం మీద సర్వే చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.ఈ పత్రిక చేసిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ
కార్యక్రమాల వలన వంద నుండి నూట ఆరు సీట్ల వరకు గెలుపొంది అధికారాన్ని చేపట్టడం ఖాయం అని తెలిపింది.మరోవైపు ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న పలు అవినీతి అక్రమాల వలన ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఏ ఒక్కటి నేరవేర్చకపోవడమే కాకుండా రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను కూడా తుంగలో తొక్కడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆ పార్టీ అధికారానికి దూరం కావడం ఖాయం అని తేలింది.

See Also:షాక్ న్యూస్ ..బండ్ల గణేష్‌కు భయంకరమైన వ్యాధి..!

మరోవైపు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ గత నాలుగు ఏండ్లుగా ప్రజాసమస్యలపై పోరాడుతూనే మరోవైపు టీడీపీ అవినీతి పాలనపై అలుపు ఎరగని పోరాటం చేస్తుండటంతో ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటంతో ఒకవేళ ఎన్నికలు జరిగితే వైసీపీ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఖాయం అని తెలిపింది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణమైన ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఈ సారి ఏ మాత్రం పని చేయదని ..ఒకవేళ ఆ పార్టీ నిలబడిన కానీ టీడీపీ ఓట్లు మాత్రమే చీలతాయి ..వైసీపీకి ఉన్న ఓట్లు అలాగే ఉండటమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు కూడా వైసీపీకి పడటంతో ఆ పార్టీ గెలుపుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అని టైమ్స్ పత్రిక తెలిపింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన అరవై ఏడు మంది ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెల్సిందే.

See Also:కామినేని శ్రీనివాస్ పై కత్తి మహేశ్..క‌త్తి లాంటి ట్వీట్..!

అయితే వారు పార్టీ ఫిరాయించిన కానీ వైసీపీ క్యాడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ ఇరవై మూడు మంది ఓడిపోవడం ఖాయం అని తేలింది.ఇక టీడీపీ విషయానికి మొత్తం నూట ఇరవై ఒక్క మంది ఉండగా అందులో కేవలం పంతొమ్మిది మాత్రమే గెలుస్తారు.మిగతావారు చిత్తు చిత్తుగా ఓడిపోతారు అని తేలింది.ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో కూడా ఏ ఒక్కరు గెలవరని తేలింది..ఇక వైసీపీలో ఉన్న నలబై నాలుగు మంది జగన్ ప్రభావంతో ,టీడీపీ సర్కారు అవినీతి పాలనపై ప్రజల్లో పీకల్లోతు ఉన్న తీవ్ర వ్యతిరేకత వలన వారు మరల అసెంబ్లీ గేటు తొక్కడం ఖాయమని ఈ సర్వేలో తేలింది.టైమ్స్ పత్రిక మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిర్వహించిన సర్వేలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి 80నుండి తొంబై ఐదు సీట్లు ..టీడీపీ పార్టీకి ఇరవై నుండి అరవై స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు తేలింది.

See Also:బిగ్ బ్రేకింగ్‌: భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి రాజీనామా..!!

మిగత ఇరవై నియోజకవర్గాల్లో అక్కడి స్థానిక పరిస్థితుల వలన ఎవరు గెలిచిన బొటా బోటి మెజారిటీతోనే గెలుస్తారు అని ఈ పత్రిక తెలిపింది.రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎవరికీ ఎన్ని సీట్లు ఒక లుక్ వేద్దామా ..!శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది స్థానాలుండగా వైసీపీకి ఐదు,టీడీపీకి ఐదు ,విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో వైసీపీకి ఆరు ,టీడీపీకి మూడు ,విశాఖలో వైసీపీ ఎనిమిది,టీడీపీకి మూడు ,మిగతా చోట్ల తీవ్రమైన పోటి ,ఉభయగోదావరి జిల్లాలలో మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో టీడీపీకి పదకొండు వైసీపీకి పద్దెనిమిది ,మిగిలిన చోట్ల గట్టి పోటి,కృష్ణాలో పదహారు స్థానాలకు వైసీపీకి ఎనిమిది స్థానాలు ,టీడీపీకి ఏడు స్థానాలు మిగిలిన ఒక్క స్థానలో గట్టి పోటి,గుంటూరు ,ప్రకాశం జిల్లాలో మొత్తం ఇరవై తొమ్మిది స్థానాలకు వైసీపీకి పద్నాలుగు,టీడీపీ పన్నెండు స్థానాల్లో మిగిలిన మూడు స్థానాల్లో తీవ్రమైన పోటి ,నెల్లూరులో ఉన్న పది స్థానాల్లో వైసీపీకి ఆరు టీడీపీకి నాలుగు ,ఇక రాయలసీమ విషయానికి వస్తే వైసీపీ ప్రభంజనానికి తిరుగు లేకుండా పోయింది.మొత్తం రాయలసీమ ప్రాంతంలో యాబై మూడు స్థానాల్లో వైసీపీ ముప్పై స్థానాల్లో టీడీపీ పది స్థానాల్లో గెలుపొందుతుందని ..మిగత స్థానాల్లో గట్టి పోటి ఉంటుందని టైమ్స్ పత్రిక ప్రకటించింది..

See Also: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!