23 ఏళ్ల నటి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య – Dharuvu
Breaking News
Home / CRIME / 23 ఏళ్ల నటి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

23 ఏళ్ల నటి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

బెంగాలీ టీవీ సీరియల్ నటి 23 ఏళ్ల మౌమిత సాహా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. దక్షిణ కోల్ కతా లోని రీజెంట్ పార్క్ ఏరియాలో ఉన్న తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం నుంచి డోర్ ఓపెన్ చేయకపోవడంతో… ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు, తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇంటిలోకి వెళ్లిన పోలీసులకు సీలింగ్ కు వేలాడుతున్న మౌమిత మృతదేహం కనిపించింది. రెండు నెలల క్రితమే ఆమె ఆ ఇంటిని రెంట్ కు తీసుకున్నట్టు సమాచారం. ఆ ఇంట్లో ఆమె మాత్రమే ఒంటరిగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆమె రాసిన సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. డిప్రెషన్ వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.