దిగొచ్చిన సర్కారు..రైతులే గెలిచారు..! – Dharuvu
Breaking News
Home / NATIONAL / దిగొచ్చిన సర్కారు..రైతులే గెలిచారు..!

దిగొచ్చిన సర్కారు..రైతులే గెలిచారు..!

మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజులు పల్లె అనక పట్టణం అనక ప్రతి గ్రామాల నుండి రైతన్నలు చేసిన పోరాటాలకు ఉద్యమాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఈ క్రమంలో రైతన్నలు కోరిన రుణమాఫీ ,గిట్టుబాటు ధరల లాంటి హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీంతో దాదాపు అరా లక్షమందికిపైగా ఉన్న రైతులు దేశంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై మహానగరాన్ని విడిచి తిరిగి రాష్ట్రంలో పల్లెబాటలు పడుతున్నారు.

see also :అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న సీఎం కేసీఆర్..!

ఇటీవల  లాంగ్‌మార్చ్ పేరుతో రైతులు నాసిక్ నుంచి వారం కింద రాష్ట్ర రాజధాని ముంబైకి పాదయాత్ర ప్రారంభించడం తెలిసిందే. 180 కి.మీ. సాగిన యాత్ర సోమవారం ఉదయం ముంబై చేరుకుంది. తర్వాత రైతులు ఆజాద్ మైదాన్ చేరుకున్నారు. రైతులను అడ్డుకుంటే చెడ్డపేరొస్తుందనే భయంతో ఫడ్నవిస్ సారథ్యంలోని బీజేపీ సర్కారు మౌనంగా ఉండిపోయింది. వారికి భద్రత కల్పిస్తూ సహకరించింది కూడా.యాత్ర ముంబై చేరుకున్నాక సీఎం.. రైతులతో చర్చలు కోసం తన సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. చర్చల తర్వాత సీఎం ప్రకటన చేశారు. రైతాంగ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, పంటలకు పెట్టుబడితో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువగా గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక కుటుంబానికి రూ. 1.5లక్షల రుణాన్ని మాఫీ చేసే అంశాన్ని పరిశీలించి . రైతు కుటుంబాలకు వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.

see also :ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!