సీనియర్‌ సినీనటుడు సత్యనారాయణ మృతి..! – Dharuvu
Breaking News
Home / MOVIES / సీనియర్‌ సినీనటుడు సత్యనారాయణ మృతి..!

సీనియర్‌ సినీనటుడు సత్యనారాయణ మృతి..!

సీనియర్‌ సినీనటుడు వంకాయల సత్యనారాయణ (78) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంకాయల సత్యనారాయణ అనేక చిత్రాల్లో క్యారెక్టర్‌ నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్‌లోనూ నటించారు.

see also..వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఎవరిదో తెలిస్తే..టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళే ….!

స‌త్య‌నారాయ‌ణ 1940వ సంవ‌త్స‌రం, డిసెంబ‌ర్ 28వ తేదీన విశాఖ‌ప‌ట్నంలో చవల వారి వీధిలోజ‌న్మించారు. న‌ట‌న మీద ఆస‌క్తితో సినిమా రంగంలోకి వ‌చ్చి ప‌లు చిత్రాల్లో క్యారెక్ట‌రు ఆర్టిస్టుగా న‌టించారు. త‌న కెరీర్‌లో దాదాపు 180 సినిమాలు, ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించారు. బికామ్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన వంకాయ‌ల.. 1960 ఆగ‌స్టులో షూటింగ్ కాంపిటీష‌న్‌లో దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిచారు. చ‌దువు, ఆట‌ల్లో ప్ర‌తిభ కార‌ణంగా హిందుస్థాన్ షిప్‌యార్డులో మంచి ఉద్యోగం వ‌చ్చిన‌ప్ప‌టికీ న‌ట‌న అంటే ఉన్న ఇష్టంతో సినిమా రంగంవైపు అడుగులేశారు. `నీడ లేని ఆడ‌ది` సినిమాతో అరంగేట్రం చేసిన స‌త్యనారాయ‌ణ.. `సూత్ర‌ధారులు`, `సీతామ‌హాల‌క్ష్మి`, `దొంగ‌కోళ్లు`, `ఊరికిచ్చిన మాట‌`, `విజేత‌`, `శ్రీనివాస క‌ల్యాణం` లాంటి సినిమాల్లో న‌టించారు.

see also..చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్ర‌మంత్రి..!!