పక్కింటి మహిళ స్నానం చేస్తుంటే ..వీడియో తీసిన పోలీసు…! – Dharuvu
Breaking News
Home / CRIME / పక్కింటి మహిళ స్నానం చేస్తుంటే ..వీడియో తీసిన పోలీసు…!

పక్కింటి మహిళ స్నానం చేస్తుంటే ..వీడియో తీసిన పోలీసు…!

ప్రస్తుతం ఆడవాళ్ళకు రక్షణ కరువవుతుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా,ఎన్ని చట్టాలు రూపొందించినా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేగాక రక్షణగా ఉండవల్సిన పోలీసులే వారిపై లైంగిక దాడి చేస్తే వారు ఇక ఎవరికి చెప్పుకుంటారు. తాజాగా బళ్లారిలో జరిగిన ఒక సంఘటన పోలీసుపై ఉన్న నమ్మకాన్ని పోగెట్టేలా ఉంది. రక్షణ కలిపించాల్సిన పోలీసే కామాంధుడయ్యాడు. ఒక మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి దాన్ని అడ్డుపెట్టుకొని ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు.

see also..టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..!

బళ్లారి జిల్లాలోని హోస్ పేట కు చెందిన పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు వెంకటేష్. తన పక్కింట్లో ఉండే ఒక వివాహిత బట్టలు మార్చుకొని స్నానం చేస్తున్న టైములో వీడియో తీసాడు. ఆ వీడియోను అడ్డం పెట్టుకొని తన కోరిక తీర్చమంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఒక వేళ అలా చేయని పక్షంలో ఆ వీడియో ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు పాల్పడేవాడు. గత కొంతకాలంగా వెంకటేష్ వేధింపులు భరిస్తూ వస్తున్న ఆమె ఇక భరించలేక మొత్తం విషయాన్ని తన భర్తకు చెప్పింది. దీంతో భర్త వెళ్లి వెంకటేష్ తో మాట్లాడగా స్మగ్లింగ్ కేసులో ఇరికిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసింది. విషయం తెలుసుకున్న వెంకటేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు.

see also..వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఎవరిదో తెలిస్తే..టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళే ….!