Home / POLITICS / కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..!

కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప‌నితీరు, వ్య‌క్తిత్వం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలియ‌జేసేందుకు మ‌రో తాజా ఉదాహ‌ర‌ణ ఇది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్‌ ప్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) గూపునకు చెందిన ఆప్టికల్‌ ఫైబర్‌ ప్లాంటుకు ఆయన రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రైటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌, స్థానిక సర్పంచ్‌ జెల్లల లక్ష్మయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా హెచ్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీ చైర్మెన్‌ మహేంద్ర ప్రతాప్‌ శుక్లా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని పంచుకున్నారు.

SEE ALSO :రాయ‌ల‌సీమ‌లో వైసీపీ తుడిచిపెట్టుకు పోవ‌డం ఖాయం..!!

మంత్రి కేటీఆర్‌తో జరిపిన 15 నిమిషాల ప్రసంగమే తమ కంపెనీ తెలంగాణలో ఏర్పాటుకు కారణమని  తెలిపారు. ‘దేశంలో మా కంపెనీని విస్తరణకు ఏ రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకోవాలనే అన్వేషణలో భాగంగా తెలంగాణ ఐటీశాఖ ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరితో సమావేశం అయ్యాను. మాతో ప్రాథమిక భేటీ జరిపిన సుజయ్‌..తమ మంత్రి కేటీఆర్‌తో ఒక్కసారి సమావేశం అవ్వాల్సిందిగా మాకు సూచించారు. అనంతరం ఢిల్లీలో మేం మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యాం. కేవలం 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం తెలంగాణ తప్ప మరే రాష్ట్రాన్ని ఎంచుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం.“ అంటూ స‌భ్యుల హ‌ర్ష‌ద్వానాల మ‌ధ్య వెల్ల‌డించారు.

SEE ALSO :ఫ‌లించిన మంత్రి కేటీఆర్ కృషి..సిద్ధిపేట‌కు జ‌పాన్ టాప్‌ కంపెనీ

ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ ` ఎందుకంటే..రాష్ట్రం కోసం ఆయన చూపుతున్న ఆసక్తిని మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అభివృద్ధి కోసం వారు రూపొందించిన ప్రణాళికలు మా కంపెనీని విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే మేం ఇక్కడే విస్తరణను ఎంచుకున్నాం. ఒక రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే ఇలాంటి నాయకులు కావాలి. ఇలాంటి నాయకులు సారథ్యం వహిస్తే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది’ అని ప్రశంసించారు. అంతేకాకుండా…రాబోయే కాలంలో తాము ఏ విస్తరణ కార్యక్రమం చేపట్టినా దానికి తలంగాణను కేంద్రంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat