ప్రజాసంకల్పయాత్ర .. 112వ రోజు షెడ్యూల్‌ ఇదే..! – Dharuvu
Home / ANDHRAPRADESH / ప్రజాసంకల్పయాత్ర .. 112వ రోజు షెడ్యూల్‌ ఇదే..!

ప్రజాసంకల్పయాత్ర .. 112వ రోజు షెడ్యూల్‌ ఇదే..!

వైసీపీ అధినేత  వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్పయాత్ర నేటికి 111రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.అయితే రేపటి ప్రజసంకల్ప యాత్ర షెడ్యూల్‌ను వై సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు.బుధవారం ఉదయం జగన్ బాపట్ల నియోజకవర్గం ఈతేరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి .. అక్కడ నుంచి చుండూర్‌పల్లి మీదుగా ములకుదురు చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం మాచవరం క్రాస్ రోడ్డు మీదుగా చింతలపూడి చేరుకొని పార్టీ జెండాను ఎగురవేస్తారు.11 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి పొన్నూరు ఐస్లాండ్‌ సెంటర్‌ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు పాదయాత్రను ముగిస్తారు