2019లో జ‌గ‌నే సీఎం.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు..!! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / 2019లో జ‌గ‌నే సీఎం.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు..!!

2019లో జ‌గ‌నే సీఎం.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ 2019లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాదాణ‌ను చూసి అటు రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు ఇటు సినీ న‌టులు కూడా జ‌గ‌న్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విష‌యం తెలిసిందే.

see also : ప‌వ‌న్ క‌ల్యాణ్‌..! ప‌డుకుంటేనే అవ‌కాశం ఇచ్చే ర‌కం..!!

see also : కారుకు డబ్బులు కట్టలేనోడు ..ఎనబై కోట్లతో ఇల్లు నిర్మించడమా ..!

తాజాగా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కూడా వైఎస్ జ‌గ‌న్‌పై త‌న‌కున్న అభిమానాన్ని మీడియా సాక్షిగా చాటుకున్నారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే ప‌టిమ‌గ‌ల నాయ‌కుడ‌న్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో వైఎస్ జ‌గ‌న్ త‌న శ‌క్తిని మ‌రింత పెంచుకుంటున్నార‌ని, నాడు ఎన్టీయార్‌, వైఎస్ఆర్‌లు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయేలా పాలన అందించార‌ని, ఇప్పుడు అలాంటి పాల‌న‌నే వైఎస్ జ‌గ‌న్ అందించ‌గ‌ల‌డ‌ని స్ప‌ష్టం చేశారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. ఇదిలా ఉండ‌గా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ జ‌గ‌న్‌పై చేసిన ఈ పాజిటివ్ వ్యాఖ్య‌లు.. త్వ‌ర‌లో వైసీపీలోకి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వ‌స్తాడ‌న్న వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి.