ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్ – Dharuvu
Home / POLITICS / ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్

ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడారు.వరంగల్ మరియు కరీంనగర్ డెవలప్ మెంట్ అథారిటీ లకు అతి త్వరలోనే పాలకమండలిని నియమిస్తామని అని తెలుపారు.ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అధికంగా ప్రోత్సహాకాలిస్తున్నామని చెప్పారు.

see also :కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..!

ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్లకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అని చెప్పారు.సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.. కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వం రద్దు, ఇతరు సభ్యుల సస్పెన్షన్‌పై స్పందించారు. నేరానికి పాల్పడ్డవారే కాదు.. ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులే అని తెలిపారు. నిన్నటి ఘటనలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌కు మిగతా సభ్యులు సహకరించారు అని పేర్కొన్నారు.

see also :జ‌గ‌న్‌కు ఏమైంది..??