కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్‌ కు ఎన్టీఆర్ – Dharuvu
Home / ANDHRAPRADESH / కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్‌ కు ఎన్టీఆర్

కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్‌ కు ఎన్టీఆర్

నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జోడీగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎమ్మెల్యే’ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది. ‘ఎమ్మెల్యే’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు ఉపేంద్ర మాధమ్. ‘ఎమ్మెల్యే’ టైటిల్ పాటు టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

ఈ నెల 17 కర్నూల్‌లో జరిగే ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరౌతున్నట్లు సమాచారం. ఇటీవల ఎన్టీఆర్ ‘లవకుశ’ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మాతగా సొంత బ్యానర్‌లో నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూట్‌కు రెడీ కాగా… రామ్ చరణ్‌తో రాజమౌళి దర్శకత్వంలో పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎమ్మెల్యే’ ఆడియో ఫంక్షన్‌లో తారక్.. రాజమౌళి మూవీపై హింట్ ఇస్తారేమో చూడాలి.