జగన్ బాటలో యువహీరో మనోజ్ ..! – Dharuvu
Home / ANDHRAPRADESH / జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!

జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో ,మంచు మోహన్ మోహన్ బాబు తనయుడు ,యువహీరో మంచు మనోజ్ కుమార్ నడవనున్నారా ..?అంటే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ హామీల గురించి పోరాడుతున్న సంగతి తెల్సిందే.

see also : ప‌వ‌న్ క‌ల్యాణ్‌..! ప‌డుకుంటేనే అవ‌కాశం ఇచ్చే ర‌కం..!!

ఈ అంశం గురించి యువహీరో మంచు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర సర్కారు మీద పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.మహారాష్ట్రంలో రైతన్నలు తమ హామీల కోసం పోరాడినట్లు ఏపీ ప్రజలు కల్సి వచ్చే పార్టీలకు చెందిన నాయకుడు కింద పోరాటం చేయాలి.పోరాడితేనే హోదా వస్తది.

see also :వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌ సంచలన వాఖ్యలు..!

లేకపోతే చివరికి మనకు చిప్ప తప్ప ఏమి మిగలదు ..కేంద్రాన్ని నమ్ముకుంటే సంక నాకిపోతాం అని ఆయన మనకు ప్రత్యేక హోదా రాదా అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు.మనోజ్ రిప్లై పై నెటిజన్లు ,రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ మనోజ్ జగన్ నడిచిన బాటలో ప్రత్యేక హోదా కోసం నడవమని తన అభిమానులకు ,ఏపీ ప్రజలకు పిలుపునిస్తున్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు ..