వినూత్న రీతిలో ఎంపీ క‌విత పుట్టిన‌రోజు జ‌రిపిన స్కూల్ విద్యార్థులు – Dharuvu
Breaking News
Home / TELANGANA / వినూత్న రీతిలో ఎంపీ క‌విత పుట్టిన‌రోజు జ‌రిపిన స్కూల్ విద్యార్థులు

వినూత్న రీతిలో ఎంపీ క‌విత పుట్టిన‌రోజు జ‌రిపిన స్కూల్ విద్యార్థులు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదినం సంద‌ర్భంగా ఓ పాఠ‌శాల విద్యార్థులు ఆమె ప‌ట్ల త‌మ‌కున్న మ‌మ‌కారాన్ని చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క‌విత బ‌ర్త్‌డే వేడుక‌లు నిర్వ‌హించ‌గా రాజేంద్రనగర్ నియోజక వర్గం, హైదర్శాకోట్ లోని కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న  బాలికల స్కూల్‌కు చెందిన బాలిక‌లు ఇలా త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు  మేడే రాజీవ్ సాగర్, రగడంపల్లి శ్రావణ్‌లు ఆ పాఠ‌శాల‌ ట్రస్టు చైర్మన్ పద్మావతి రూ.1 లక్ష అందజేసిన సంద‌ర్భంగా త‌మ శుభాకాంక్ష‌ల‌ను ఈ రూపంలో తెలియ‌జేశారు.

see also :జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!

కాగా, ఎంపీ క‌విత జ‌న్మ‌దినాన్ని తెలంగాణ జాగృతి ఘనంగా నిర్వహించింది. రవీంద్రభారతి పైడి జయరాజ్ మినీ థియేటర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో  మేడే రాజీవ్ సాగర్ రూపొందించిన ‘జయహో జననీ నీరాజనం’ వీడియో పాటల సీడీలను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ సామాజిక, చైతన్య దీప్తి కవిత అన్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత కు రమణాచారి సభాముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కస్తూరిబా స్కూల్ కు రూ.1 లక్ష అందజేయడం  బాలికా విద్యకు ఊతమిస్తుందని ప్రశంసించారు.భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ మన పండుగలు, ఆచార వ్యవహారాలకుఅంతర్జాతీయ ఖ్యాతి తో పాటు తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిల్చిన ఎంపీ కవితను మన కాలపు రుద్రమ దేవిగా అభివర్ణించారు.

see also :ఫలించిన సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌..మంత్రి కేటీఆర్ కృషి..!

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి పతాక కవితమ్మ అన్నారు. రెండురోజులుగా రక్తదానాలు, వీడియో పాటలు , పుస్తకాలు ఆవిష్కరణ లు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాలను చూస్తుంటే జాగృతి అధ్యక్షురాలు కవిత యువతీయువకుల గుండెల్లో  నిల్చిపోయిన విషయం స్పష్టమయిందన్నారు. ఈ కార్య్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు మేడే రాజీవ్ సాగర్, నవీన్ ఆచారి, కోరబోయిన విజయ్, పసుల చరణ్, వర్మ, అనంతుల ప్రశాంత్,రాజేంద్ర నగర్ జాగృతి నాయకులు రగడంపల్లి శ్రావణ్, రాదేశ్యాం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Image may contain: 12 people