Home / POLITICS / దేశ పార్ల‌మెంటు, శాస‌న‌స‌భ తదిత‌ర చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుల‌పై స‌స్పెన్ష‌న్‌ సంద‌ర్భాలు..!

దేశ పార్ల‌మెంటు, శాస‌న‌స‌భ తదిత‌ర చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుల‌పై స‌స్పెన్ష‌న్‌ సంద‌ర్భాలు..!

దేశంలో, రాష్ట్రంలో స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌పై పార్ల‌మెంటు, శాస‌న‌స‌భ‌లు అనేక‌సార్లు స‌స్పెన్ష‌న్లు, బ‌హిష్క‌ర‌ణ చ‌ర్య‌లు తీసుకున్న సంద‌ర్భాలున్నాయి. సాక్షాత్తు ఇందిరాగాంధీ వంటివారు కూడా స‌భ‌ల నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన సంద‌ర్భాలున్నాయి. స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న అనుచితంగా ఉన్న సంద‌ర్భంలో శాస‌న‌స‌భకు, స్పీక‌ర్‌కు చ‌ర్య‌లు తీసుకునే సంపూర్ణ అధికారం ఉంటుంది.

1. 1966 ఆగ‌స్టు 29న య‌శ్వంత‌ రావు మేఘావ‌ల్ vs మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ కేసులో ఇద్ద‌రు స‌భ్యుల‌పై బ‌హిష్క‌ర‌ణ (ఎక్స్‌పెల్‌) చేసిన కేసులో అక్క‌డి హైకోర్టు శాస‌న‌స‌భ స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్దించింది. స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న నేప‌థ్యంలో ఏలాంటి చ‌ర్య‌ల‌నైనా తీసుకునే అధికారం శాస‌న‌స‌భ‌కు ఉన్న‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఆర్టిక‌ల్ 194(3) ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని చెప్పంది. శాస‌న‌స‌భ నిబంధ‌నావ‌ళిని రూపొందించుకోక‌పోయినా శాస‌న‌స‌భ తీర్మాణం చేసి చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని పేర్కొన్న‌ది .

2. 1976 న‌వంబ‌ర్ 15న రాజ్య‌స‌భ స‌భు్య‌డుగా ఉన్న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిని అనుచిత ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా స‌భ నుంచి బ‌హిష్క‌రించారు .

3. 2005 డిసెంబ‌రులో 11 మంది రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఓటుకు నోటు కేసులో బ‌హిష్క‌రించారు .

4 .ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2008 మార్చి లో ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం ఒంగోలు జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆరునెల‌ల‌పాటు శాస‌న‌స‌భ నుంచి స‌స్పెండ్ చేశారు.

5. 1977 న‌వంబ‌ర్ 18న సాక్షాత్తు దేశ‌ప్ర‌ధాన మంత్రిగా ప‌నిచేసిన ఇందిరాగాంధీని లోక్‌స‌భ నుంచి బ‌హిష్క‌రించారు.

6. 1964 జూన్ 13వ తేదీన అనుచిత ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా మ‌హారాష్ట్ర శాస‌న‌స‌భ ఒక స‌భ్యుడిని బ‌హిష్క‌రించింది.

7. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2015లో ఎమ్మెల్యే రోజా శాస‌న‌స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు, ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై ఆర్టిక‌ల్ 194(3) ప్ర‌కారం ఏడాదిపాటు స‌స్పెండ్ చేశారు.

8. కేర‌ళ శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే సంద‌ర్భంగా రాష్ర్ట ఆర్థిక మంత్రి ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించిన ఎమ్మెల్యేల‌పై 2015 మార్చి 15న పోలీసు కేసు కూడా పెట్టారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat