ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మహిళ నేతను అతికిరాతకంగా హత్య..! – Dharuvu
Breaking News
Home / CRIME / ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మహిళ నేతను అతికిరాతకంగా హత్య..!

ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మహిళ నేతను అతికిరాతకంగా హత్య..!

టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిని కత్తిపీటతో పీకకోసి హతమార్చారు. కన్న తల్లి ముందే కుమార్తెను కట్టేసి కిరాతకంగా చంపారు కొందరు కిరాతకులు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది. రామిళ్ల కవితకు 16 ఏళ్ల క్రితం మల్లయ్యతో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ కలహాలతో పదేళ్లుగా భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కవిత తన తల్లిగారి గ్రామమైన కొత్తపల్లిలో ఇల్లు నిర్మించుకుని ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. ప్రస్తుతం టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అతికిరాతకంగా చంపేశారు.

see also..వారం రోజులుగా ”అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం”..! కార‌ణం తెలిస్తే షాక్‌..!!

ఇద్దరు దుండగులు కిటికీలో నుంచి కవిత ఇంట్లోకి ప్రవేశించారు. వచ్చి రావడంతోనే ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇది గమనించిన కూతురు శిరీష అరవడానికి ప్రయత్నించింది. దుండగులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి పక్క గదిలో పడేశారు. ఇంట్లో ఉన్న కత్తిపీటతో కవిత మొఖంపై విచక్షణ రహితంగా కొట్టి చంపేశారు. ముఖం పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా దాడి చేశారు. హత్యకు పాల్పడిన దుండగులు మంకీ క్యాప్, మాస్క్‌లు ధరించినట్లు మృతురాలి కూతురు చెబుతోంది. డాగ్‌ స్క్వాడ్‌ సంఘటన స్థలం నుంచి ప్రధాన రహదారి వద్దకు వెళ్లి ఆగిపోయింది. నిందితులు బైక్‌పై వచ్చి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.