వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌ సంచలన వాఖ్యలు..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌ సంచలన వాఖ్యలు..!

వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌ సంచలన వాఖ్యలు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రపై జాతీయ మీడియాకు చెందిన సీనియర్ ఎడిటర్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆన్ రియాలిటీ చెక్ అనే కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు.

See Also:పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్ ..!

నిన్న సోమవారం ఆ ఛానల్ లో ప్రసారమైన ఈ ఇంటర్వ్యూ లో శ్రీనివాసన్ అడిగిన పలు ప్రశ్నలకు జగన్ చాలా ఓర్పుతో సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటననే మరల తిప్పి తిప్పి చేశారు.అయిన కానీ చంద్రబాబు ఎందుకు ఎన్డీఏతో మిత్రపక్షంగా ఉంటున్నారో అర్ధం కావడంలేదు.జగన్ బీజేపీతో కల్సి ఉంటె అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడతాను ..తమ పార్టీ ఎంపీల చేత ఎందుకు రాజీనామా చేయిస్తా అని జగన్ ప్రశ్నించారు.

See Also:ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గతంలో చేసిన ప్రకటననే తాజాగా మరోసారి చేశారని, అయినా చంద్రబాబు ఎందుకు తన మంత్రులను కేంద్ర కేబినెట్‌ నుంచి  ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు.అయితే జగన్ చేస్తున్న పాదయాత్ర.. నేషనల్ పాలిటిక్స్ ను ఎమన్నా ప్రభావం చేయగలదా ..? .వంద రోజులకు పైగా జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర.. జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుందా? అనే అంశం మీద జగన్‌తో ఎన్డీటీవీ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అయిన అనంతరం జగన్ తో ఇంటర్వ్యూ గురించి శ్రీనివాసన్‌ జైన్‌ ట్వీట్‌ చేస్తూ ఆయన రాజకీయ ప్రస్థానం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపే అవకాశముందని ట్వీట్ చేశారు ..

See Also:వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..