వైసీపీలోకి భూమా నాగి రెడ్డి ప్రాణ మిత్రుడు ఆళ్ళగడ్డ ఏవి సుబ్బారెడ్డి.. ? – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / వైసీపీలోకి భూమా నాగి రెడ్డి ప్రాణ మిత్రుడు ఆళ్ళగడ్డ ఏవి సుబ్బారెడ్డి.. ?

వైసీపీలోకి భూమా నాగి రెడ్డి ప్రాణ మిత్రుడు ఆళ్ళగడ్డ ఏవి సుబ్బారెడ్డి.. ?

ఏపీ రాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఎటూ అర్ధం కాకుండా పోతున్నాయి.ఈ నేపథ్యంలో అందరు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కర్నూలు జిల్లాలో నంద్యాల టిడిపికు చెందిన కీలక నేత ఏవి సుబ్బారెడ్డి త్వరలో వైసిపిలోకి చేరటం ఖాయమని తెలుస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో రానున్న ఎన్నికల్లోపు కర్నూలు జిల్లా వైసిపిలో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చని టీడీపీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఏవి కూడా తొందరలోనే టిడిపికి గుడ్ బై చెప్పేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిణామాల్లో ఏవి టిడిపిలో ఇమడలేకున్నది వాస్తవం. ఎందుకంటే మంత్రి భూమా అఖిలప్రియకు, ఏవికి ఏమాత్రం పడటం లేదు. వీరిద్దరి మధ్య గొడవలకు చాలా కారణాలే ఉన్నాయి. వ్యాపారస్తుడు కూడా అయిన ఏవిని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మంత్రి ఇబ్బంది పెడుతున్నట్లు టిడిపిలోనే ప్రచారంలో ఉంది.
ఇటువంటి పరిస్ధితుల్లో ఇక టిడిపిలో ఉండటం కష్టమని అర్ధం చేసుకున్న ఏవి వైసిపి వైపు చూస్తున్నారట. ఏవిని వైసిపిలోకి తీసుకొచ్చేందుకు వైసిపి నేత శిల్పా చక్రపాణిరెడ్డే చొరవ చూపిస్తున్నారని సమాచారం.

ఎందుకంటే, చక్రపాణి-ఏవి మంచి మిత్రలేకాకుండా వ్యాపార భాగస్తులు కూడా. దాంతో చక్రపాణిరెడ్డే చొరవ తీసుకుని ఏవి విషయం వైసిపి కీలక నేతలతో మాట్లాడారట. వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం నుడి పోటీ చేసేందుకు టిక్కెట్టు కేటాయించాలని ఏవి పట్టుబడుతున్నారట. అయితే, శ్రీశైలం నుండి పోటీ చేసేందుకు ఇప్పటికే చక్రపాణి రెడ్డి రెడీ అయ్యారు. హటాత్తుగా ఏవి ప్రతిపాదనతో ఏం చేయాలో కీలక నేతలకు అర్దం కావటం లేదట.దాంతో ఆ విషయాన్ని మిత్రులకే వదిలేసారట. ఏవికి శ్రీశైలం టిక్కెట్టు ఇస్తే చక్రపాణి రెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీ చేసేట్టు, శిల్పా మోహన్ రెడ్డికి ఎంఎల్సీ ఇచ్చి, మోహన్ రెడ్డి కొడుకును నంద్యాల ఎంపిగా పోటీ చేయించే ప్రతిపాదన కీలక నేతలు పరిశీలనలో ఉందట .ఈ ప్రతిపాదన గనుక ఓ కొలిక్కి వస్తే వచ్చే ఆగస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డిని నంద్యాలకు కానీ శ్రీశైలంకు కానీ పిలిపించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ సభలో ఏవి సుబ్బారెడ్డి తన మద్దతు దారులతో వైసిపి కండువా కప్పుకుంటారని తెలుగు తమ్ముల్లే బాహాటంగా అనుకుంటున్నారు .