Home / CRIME /  నేను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్‌ చేయమని లవర్ ని అడిగి..లైవ్ లో ఉరికి బలి

 నేను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్‌ చేయమని లవర్ ని అడిగి..లైవ్ లో ఉరికి బలి

కన్న కొడుకుపై ఎన్నో ఆశలను పెట్టుకుని రెక్కలు ముక్కలు చేసుకుని,కొడుకులు కోసం కడుపులు మాడ్చుకుని చదువులు చదివించారు. తమ కొడుకు ప్రమోజకుడై, అండగా ఉంటాడనుకున్నా ఆ తల్లిదండ్రల ఆశ నిరాశే అయ్యింది. తాను ఏంతగానో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసిందని ఆమె లేకుంటే ఇక భవిష్యత్తే లేదనుకోని ఏకంగా ఈ లోకాన్నే వీడాడు ఓ యువకుడు. ఒకే ఒక్క నిమిషం ఆలోచించకుండా,క్షణికావేశంతో ఆ యువకుడు తీసుకున్న నిర్ణయంతో నిండు జీవితాం అర్థాంతరంగా ముగిసింది. ప్రేమికురాలితో వీడియో కాల్‌ మాట్లాడుతూనే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 20 ఏళ్ల అజ్మీర్‌ సాగర్‌ మల్కాజ్‌గిరిలోని వినాయక్‌ నగర్‌లో తన సోదరితో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సాగర్‌ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే నాలుగు నెలల క్రితం ఆ యువతి బంధువులతోపాటు, ఇంట్లోవాళ్లు కూడా ఈ ప్రేమ వ్యవహరంలో సాగర్‌ని హెచ్చరించారు. సాగర్‌ తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూడటంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు.

ఈ సందర్భంగా ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆమె నువ్వు చనిపోతే నీ మీద కోపం పోతుంది అంటూ సాగర్‌కు వాట్సాప్‌లో సందేశం పంపింది. ఈ విషయంపై మాట్లాడాలంటూ సాగర్‌ గురువారం ఉదయం ఆమెకు మెసేజ్‌ చేశాడు. తాను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్‌ చేయమని కోరాడు. ఆ యువతి వీడియో కాల్‌ చేయగానే.. సాగర్‌ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అయితే ఆ యువకుడు కావాలనే బెదిరిస్తున్నాడు తప్ప నిజం కాదని… ఆ అమ్మాయి తన స్నేహితురాలితో కలిసి సరదాగా వీడియో చూస్తోంది. అయితే సాగర్ నిజంగానే ఉరివేసుకుని చనిపోవడంతో ఒక్కసారిగా షాక్ గురైయ్యింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మెదక్ జిల్లా బాబుసాయిపేట్‌కు చెందినవాడిగా సమచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat