Home / Uncategorized / గ‌నుల శాఖ‌పై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌..సంచ‌ల‌న ఆదేశాలు జారీచేసిన‌ మంత్రి

గ‌నుల శాఖ‌పై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌..సంచ‌ల‌న ఆదేశాలు జారీచేసిన‌ మంత్రి

తెలంగాణ గనుల శాఖ మంత్రి కే తార‌క రామారావు ఈ రోజు గనుల శాఖపైన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీల‌క‌ అదేశాలు జారీ చేశారు. గత సంవత్సకాలంలో గనుల శాఖలో అనేక కట్లుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలియజేశారు. వరంగల్ , హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 354 తనీఖీలు నిర్వహించామని, 79 ఉల్లంఘనలు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. దీంతోపాటు రాష్ర్టంలో గనులు లీజు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించని 477 లీజులను రద్దు చేశామన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమ మైనింగ్‌ను సహించేది లేదని, ఎంతటి వారైనా ఒత్తిడి గురికావద్దని మంత్రి అధికారులకు తెలిపారు.

see also :పవన్ కళ్యాణ్..చిరంజీవిపై టీడీపీ మహిళ నేత దారుణమైన కామెంట్స్ ..!

ఈ సంద‌ర్భంగా గనుల శాఖలో సాంకేతిక పరిజ్ఝానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాల‌ని మంత్రి కేటీఆర్ కోరారు. ముఖ్యంగా గనుల పర్యవేక్షణలో జియోఫెన్సింగ్, జియో ట్యాగింగ్, ఉపగ్రహా చిత్రాల ఉపయోగం, డ్రోన్ల వినయోగాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం రాక్ సాండ్ వినియోగాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి, అర్ అండ్ బి శాఖల నిర్మాణాల్లో దీని వినియోగం పెంచడం కోసం అయా శాఖల ఇంజనీరింగ్ శాఖాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. టీఎస్ఎండీసీ సైతం రాక్ సాండ్ క్రషర్ల ఏర్పాటును పరిశీలించాలని అదేశించారు. పలు జిల్లాల్లో చేపట్టిన సాండ్ టాక్సీ విధానం విజయం వంతం అయిన నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ఒక్క ఫోన్ కాల్ తో రాష్ర్టంలోని ఏవరికైనా ఇసుక ఏ ధరతో లభిస్తుందో తెలిసేలా  విధానం ఉండాలన్నారు. త్వరలో తీసుకురానున్న మైనింగ్ పాలసీలో దేశంలోని అత్యుత్తమ విధానాలను చేకూర్చాలన్నారు.

see also :భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్‌ నెట్ లో హల్ చల్

ఈ సందర్భంగా రాష్ర్టంలోని సున్నపు రాయి గనుల లీజుపైన మంత్రి చర్చించారు. భవిష్యత్తులో వచ్చే ఈ గనుల లీజులకు జాతీయ స్ధాయి వేలం స్ధానంలో అంతర్జాతీ స్ధాయి వేలం నిర్వహించాలన్నారు. ఈ అర్ధిక సంవత్సరానికిగాను గనుల శాఖ ఆదాయం లక్ష్యాన్ని సాధించినట్లు మంత్రి తెలిపారు. ఈ సంవత్సరానికి గాను నిర్ధేశిత 3166 కోట్ల రూపాయాల లక్ష్యానికి గాను మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా ఫిబ్రవరీ నెఖరుకు సూమారు మూడు వేల 500 వందల కోట్ల రూపాయాల(110శాతం) అదాయం ప్రభుత్వానికి వచ్చింది. ముఖ్యంగా ఇసుక అధాయ లక్ష్యం 388కోట్లకు గాను 538 కోట్ల ఆదాయం (139శాతం) ఖజనాకు లభించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వతా అక్రమ ఇసుక తవ్వకాలపై ఉక్కపాదం మోపడంతో ఇంత పెద్ద ఎత్తున ప్రజల సంపధ ప్రభుత్వానికి చేరిందన్నారు. ఖనిజాల అధాయం ప్రజల ఆస్ది అని, అది వారి అభివృద్దికే ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.  అందుకే మైనింగ్ అదాయంలోని లీకేజీలను సాద్యమైనంత ఎక్కవగా అరికట్టామని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat