Home / ANDHRAPRADESH / చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ప్ర‌జారాజ్యం దారిలోనే.. జ‌న‌సేన కూడా..! ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!, జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా స్వ‌యాన త‌న అన్న మెగాస్టార్ చిరంజీవి దారిలోనే వెళ్తున్నాడా..? అన్న చిరంజీవి స్థాపించిన ప‌్ర‌జారాజ్యం పార్టీకి ప‌ట్టిన గ‌తే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీకి ప‌ట్ట‌నుందా..? చిరంజీవి ఇక సినిమాల‌కే ప‌రిమితం కానున్నారా..? జేఎఫ్‌సీ వేదిక‌గా చంద్ర‌బాబు అవినీతి చిట్టా బ‌య‌ట‌కు లాగుదామ‌ని య‌త్నించిన ఉండ‌వ‌ల్లికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అడుగడుగునా అడ్డు త‌గిలాడా..? ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు టీడీపీ మాయ నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదా..? అన్న‌ ప్ర‌శ్న‌ల‌కు అవుననే స‌మాధం ఇచ్చారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌. కాగా, శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవిల రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

see also : నీర‌వ్ మోడీ, చంద్ర‌బాబు భారీ కుంభ‌కోణం సీబీఐ విచార‌ణ‌లో వెలుగులోకి ..!!

see also : కేసీఆర్.. రేపటి భారత విప్లవం.!!

ఇంకో సంవ‌త్స‌రంలో సాధార‌ణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు కుట్ర‌ప‌న్నుతున్నార‌న్నారు. అందుకే అసెంబ్లీ వేదిక‌గా మొస‌లి క‌న్నీరును కార్చార‌ని ఎద్దేవ చేశారు. చంద్ర‌బాబు ఎన్ని కుతంత్రాలు ప‌న్నినా 2019లో టీడీపీ ఓట‌మి ఖాయ‌మ‌న్నారు. తాము నెల‌రోజుల‌పాటు జేఎఫ్‌సీ క‌మిటీలో ఉండి చేసిన‌దంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరులానే మిగిలిపోయింద‌న్నారు. ఇప్పుడు ఆ నివేదిక జ‌స్ట్‌బిన్‌లో ప‌డేసిన చెత్త కాగితంలా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌. జేఎఫ్‌సీకి నివేదిక స‌మ‌ర్పించాక‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరు న‌చ్చ‌క.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఓ న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చేశాన‌ని చెప్పారు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.

see also : పవన్ కళ్యాణ్ మీ బాధ ఏంటి. మీకసలు అవగాహన ఉందా. .చంద్రబాబు

చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లో కొన‌సాగుతుండ‌టం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. ఇక‌పై చిరంజీవిరాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని, ఖైదీ నెం.150 విజ‌యంసాధించింది గ‌నుక‌. చిరంజీవి ఇక సినిమాల్లోనే కొన‌సాగుతార‌ని అనుకుంటున్నానంటూ త‌న అభిప్రాయాన్ని చెప్పారు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat