నిన్న మొన్నటి వరకు క్షణం కూడా తీరిక లేకుండా సినిమాల్లో బిజీ గా ఉన్న నూతన అక్కినేని దంపతులు ( అక్కినేని నాగచైతన్య – సమంత ) .. తాజాగా వీరిద్దరూ కలిసి శివ నిర్వాణ ప్రాజెక్ట్‌లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో చిత్రానికి ప్రేయసి అనే టైటిల్ పరిశీలిస్తుండగా ఇవాల్టి నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ రోజు నుంచే వీరిద్దరూ టీ౦తో జాయిన్ అవుతున్నారు. ఈ సందర్బంగా లవర్ బోయ్ చైతూ తన ట్విట్టర్లో ఒక ఫోటోని షేర్ చేస్తూ.. ఇది ఖచ్చితంగా కొత్త రోజే.. నా శ్రీమతితో షూటింగ్‌కి వెళుతున్నాను. మీకు మరింత ఆనందాన్ని అందించనున్నాము అని ట్వీట్ చేశారు. కాగా మొన్నటివరకు చైతూ.. సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు వంటి చిత్రాలతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే..
This is definetley a new day .. heading to work with the mrs .. a fun campaign coming your way .. good morning !!! pic.twitter.com/DxSAz9KlBU
— chaitanya akkineni (@chay_akkineni) March 17, 2018