Home / SLIDER / తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఉగాది కానుక ..!

తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఉగాది కానుక ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ పర్వదినాన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు కానుకను ప్రకటించారు.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు .

మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ దేశంలోనే అత్యుత్తమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ పలు అవార్డులను దక్కించుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో మంచి పేరును సంపాదించుకున్నారు.తాజాగా ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకం కింద డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇస్తున్న సంగతి విదితమే .

ప్రస్తుతం ఆ మొత్తాన్ని ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మొత్తం వచ్చే ఏఫ్రిల్ మొదటి తారిఖు నుండి అమల్లోకి వస్తుంది అని ప్రభుత్వం తెలిపింది .అయితే ఇప్పటివరకు రెండు వేల ఐదు వందల కోట్లను ప్రభుత్వం ఈ స్కీమ్ కింద ఖర్చు చేసింది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat