Home / ANDHRAPRADESH / ఇద్దరు ముఖ్యమంత్రులంటూ సోషల్ మీడియాలో హల్ చల్..!! అవును,

ఇద్దరు ముఖ్యమంత్రులంటూ సోషల్ మీడియాలో హల్ చల్..!! అవును,

టాలీవుడ్ సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ కాంబోలో తాజాగా తెర‌కెక్కుతున్న చిత్రం భ‌ర‌త్ అనే నేను. అయితే, ఈ చిత్రం ప్రారంభం నుంచి ఇప్ప‌టికీ ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తోంది. అదేమిట‌య్యా అంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌  జీవితం ఆధారంగానే, అలాగే, 2019 సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో క‌లిసి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం. అయితే, ఈ చిత్రం జ‌గ‌న్‌కు సంబంధించింద‌ని తెలిసి కూడా మ‌హేష్ బాబు ఈ చిత్రంలో న‌టించేందుకు ఒప్పుకున్నార‌ని స‌మాచారం.

see also..

2019లో జగనే సీఎం..అది జరక్కపోతే మేము పంచాంగం చెప్పం..!

ఆ విష‌యం కాసేపు అటుంచితే.. ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌లో మ‌హేష్‌బాబు ప‌లికిన డైలాగ్‌లు వైఎస్ జ‌గ‌న్‌ను అనుస‌రించి చెప్పిన‌వేన‌న్న‌ట్టు సోష‌ల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఉగాది పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వైఎస్ జ‌గ‌న్ పంచాంగ శ్ర‌వ‌ణం వినే క్ర‌మంలో ధ‌రించిన పంచెక‌ట్టు దుస్తులు, అలాగే, జ‌గ‌న్ లుక్.. ఇలా అచ్చం వైఎస్ జ‌గ‌న్‌ను పోలిన ఓ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అదేమిటంటే.. భ‌ర‌త్ అనే నేను టీమ్ ఇవాళ విడుద‌ల చేసిన మహేష్‌బాబు పంచెక‌ట్టు. మ‌హేబాబు ధ‌రించిన పంచెక‌ట్టు.. అచ్చం వైఎస్ జ‌గ‌న్‌ను గుర్తు చేస్తోంది. దీంతో మ‌హేష్ బాబు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా, కాబోయే ఏపీ సీఎం జ‌గ‌న్‌, రాబోయే సినిమాలో మ‌హేష్ బాబు సీఎం అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

see also.

వైఎస్ జగన్‌ దెబ్బకు జాతీయ స్థాయిలో కదలిక..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat