Home / POLITICS / హాట్సాఫ్ హరీష్ రావు..!!

హాట్సాఫ్ హరీష్ రావు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ మేనల్లుడు,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పని రాక్షసుడు అని మరోసారి తెలిపోయింది.ఉగాది పండుగ పూట కూడా అర్ధరాత్రి ప్రాజెక్టుల వెంటే తిరుగుతూ అధికారులకు సూచనలు ,సలహాలు ఇస్తూ గడిపారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా..ఆదివారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆకస్మికంగా సందర్శించారు.పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించి, పనుల ప్రగతిపై అక్కడున్న ఇంజినీర్లను ఆరాతీశారు.

see also :ప‌వ‌న్ రాజ‌కీయంపై అల్లు అర‌వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

తెలంగాణ రైతులకు తిరుగులేని కానుక ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఈ ప్రాజెక్టు పూర్తయితే కోటి ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని, పనుల్లో ఎక్కడా రాజీ ఉండకూడదని తెలిపారు . ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మొదటగా బరాజ్ వద్దకు రాత్రి 11 గంటల సమయంలో చేరుకొని పనుల పురోగతిని పరిశీలించారు. ఇక్కడ మొత్తం 74 గేట్లు నిర్మిస్తుండగా అందులో 22 గేట్లు బిగింపునకు సిద్ధమయ్యాయని, మే 31 వరకు అన్ని గేట్లు బిగించేలా పనులు చేయాలని అధికారులకు సూచించారు.

see also :జ‌గ‌న్ కేసుల‌ గురించి సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన సీబీఐ రిటైర్డ్ ఎస్పీ..!!

అయితే ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీయగా.. సుమారు 2 వేల మంది రోజూ 3 షిఫ్టుల్లో పనులు చేస్తున్నామని, ప్రతిరోజూ 3 పూటలా కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నామని అధికారులు తెలిపారు.కార్మికుల్లో సైతం ఉత్సాహాన్ని నింపేలా వారితో కాసేపు మాట్లాడిన మంత్రి.. వారికి అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు. దాదాపు అర్ధరాత్రి 1.30 గంటల దాకా పనులను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడే ఉన్న నవయుగ క్యాంపు ఆఫీసులో బస చేశారు. పండుగ పూట అర్ధరాత్రి మంత్రి రావటమేంటిఅని అక్కడున్న అధికారులు సైతం ఆశ్చర్య పోయారు.ఈ క్రమంలో అక్కడున్న వారు  మంత్రి హరీష్ కు హాట్సాఫ్ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat