అన్నది పోస్ట్ పెయిడ్ పార్టీ ..తమ్ముడిది ప్రీ పెయిడ్ పార్టీ .. – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / అన్నది పోస్ట్ పెయిడ్ పార్టీ ..తమ్ముడిది ప్రీ పెయిడ్ పార్టీ ..

అన్నది పోస్ట్ పెయిడ్ పార్టీ ..తమ్ముడిది ప్రీ పెయిడ్ పార్టీ ..

టీడీపీ పార్టీ ఎంపీ కేశినేని నాని టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ చిరంజీవి ,అతని సోదరుడు ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ప్రజారాజ్యం పెట్టి రాష్ట్రాన్ని ఏదో ఉద్దరించాలని పార్టీ పెట్టిన చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ.

అందుకే ఎమ్మెల్యేకి ఇంతా ..ఎంపీ కింతా అని డబ్బులు వసూలు చేసి ..తీరా గెలిచిన పద్దెనిమిది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి కాంగ్రెస్ లో కల్పి ఎంపీ సీటు తీసుకున్నాడు .

తాజాగా పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ ప్రీ ఫెయిడ్ పార్టీ.ఎవరు ఎంత ఇస్తే వారు తరపున మాట్లాడతాడు.విభజన సమయంలో సొంత అన్నయ్యనే ప్రశ్నించలేని పవన్ ఇప్పుడు బాబును విమర్శించడం తగదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు