Breaking News
Home / MOVIES / సరికొత్త పాత్రలో సాయిపల్లవి ..!

సరికొత్త పాత్రలో సాయిపల్లవి ..!

సాయిపల్లవి మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా అనే మూవీతో యావత్తు తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ అందించిన భారీ హిట్ తో ఆ తర్వాత నేచురల్ హీరో నానితో కల్సి ఎంసీఎ మూవీతో మరింత దగ్గరైంది అమ్మడు.

ఈ తరుణంలో సాయిపల్లవి బోల్డ్ సినిమాలో నటించనున్నది అని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇండస్ట్రీలో విలక్షణ చిత్రాలను తీసే కోలీవుడ్ దర్శకుడు మిస్కీన్ ఒక రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ ను తీయబోతున్నాడు.ఈ మూవీలో నిత్యా మీనన్ తో పాటుగా పల్లవిని కూడా సెలెక్ట్ చేశారు చిత్రం యూనిట్ .

అయితే ఈ మూవీలో హర్రర్ తో పాటుగా బోల్డ్ సీన్లు ఎక్కువ ఉన్నాయి అని దర్శకుడు చెబుతున్నాడు.ఈ నేపథ్యంలో హోమ్లీ గర్ల్ ..నేచురల్ స్టార్ గా పేరు గాంచిన అమ్మడు బోల్డ్ నేపథ్యం ఉన్న సీన్లలో నటిస్తే అభిమానులు స్వీకరిస్తారో లేదో కాలమే చెప్పాలి ..