Breaking News
Home / ANDHRAPRADESH / నిరుద్యోగ యువతకు టీడీపీ సర్కారు శుభవార్త ..!

నిరుద్యోగ యువతకు టీడీపీ సర్కారు శుభవార్త ..!

ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న టీడీపీ సర్కారు శుభవార్తను ప్రకటించింది.గత సార్వత్రిక ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం గ్రామానికో ఉద్యోగం కూడా ఇవ్వకుండా గంపెడు ఆశలు పెట్టుకున్న యువత ఆశలపై నీళ్ళు చల్లింది.

అయితే తాజాగా రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం పదకొండు వందల తొమ్మిది అసిస్టెంట్ ప్రోపెషర్ల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ విషయం గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుండి పదమూడు వరకు అర్హులైన వార్ని నియమించడం జరుగుతుందని ..ఈ ప్రక్రియ అంతా ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతుందని ఆయన తెలిపారు .