2019లోనూ చంద్ర‌బాబే సీఎం అవుతారు..!! – Dharuvu
Home / ANDHRAPRADESH / 2019లోనూ చంద్ర‌బాబే సీఎం అవుతారు..!!

2019లోనూ చంద్ర‌బాబే సీఎం అవుతారు..!!

2019లో మా నాయ‌కుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబే 2019 ఎన్నిక‌ల్లోనూ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని పేర్కొన్నారు ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుండా ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు అడ్డుకుంటున్నార‌న్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పెడ‌దారులు ప‌ట్ట‌డానికి ముఖ్య కార‌ణం ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ల్లేన‌న్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స‌మావేశాలకు రాకుండా రోడ్ల‌వెంబ‌డి తిరుగుతున్నార‌ని ఎద్దేవ చేశారు. ఇలా అయితే, జ‌గ‌న్ క‌నీసం ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడిగా ఉండేందుకు అర్హుడు కాద‌న్నారు.

see also :

ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్‌తో.. ఒక్కో చెప్పుదెబ్బ‌..!!

వైఎస్ జ‌గ‌న్‌.. చంద్ర‌బాబును విమ‌ర్శించడానికి ముందు నీపై ఉన్న వంద‌ల‌కొద్ది కేసుల‌ను గుర్తు తెచ్చుకో అంటూ హిత‌వు ప‌లికారు మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్ప‌టికైనా ప్ర‌జారాజ్యం పార్టీలానే కాంగ్రెస్‌లో విలీన‌మ‌వుతుంద‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. జగన్‌ నాలుగేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్‌ జగన్‌ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.