Home / MOVIES / నందమూరి అభిమానులకు శుభవార్త ..!

నందమూరి అభిమానులకు శుభవార్త ..!

ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో తన అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త పాత్రలో తన అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు.వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే.

గత ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా ఆయా ప్రాంచేజీలతో పాటుగా బీసీసీఐ కు కూడా కనకవర్షం కురిపించింది.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఐపీఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.రానున్న ఐదేళ్ళ కాలానికి ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఇటు తెలుగు భాషతో పాటుగా పలు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయాలనీ భావిస్తుంది.

అందులో భాగంగా ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను పదకొండో ఐపీఎల్ సీజన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నది అని సమాచారం.అందుకు తగ్గట్లే ఇప్పటికే పలు వీడియోలు ,ప్రోమోలు కూడా సిద్ధం చేసింది అంట జూనియర్ తో .స్టార్ టీవీ తెలుగు ఛానల్స్ లో వీటిని ప్రసారం చేయనున్నది.మరి ఇది నందమూరి అభిమానులకు శుభవార్తే కదా ..