Home / BHAKTHI / ఈస్ట‌ర్‌ : ఇది మీకు తెలుసా..??

ఈస్ట‌ర్‌ : ఇది మీకు తెలుసా..??

ఈస్ట‌ర్‌. యేసు క్రీస్తు శిలువ‌వేయ‌బ‌డ్డ (గుడ్‌ఫ్రైడే) రోజు నుంచి మూడు రోజుల్లోనే తిరిగి స‌మాధి నుంచి లేచిన రోజును క్రైస్త‌వ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారు ఈస్ట‌ర్‌గా పండుగ‌గా జ‌రుపుకుంటారు. అయితే, యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ రోజున అస‌లు ఏం జ‌రిగింది..? ఎవ‌రి వ‌ల్ల శిలువ వేయ‌బ‌డ్డారు..? అత‌నికి ఆ సంఖ్య‌కు ఉన్న సంబంధ‌మేంటి..? ఆ సంఖ్య‌ను చూస్తే అంత భ‌య‌మెందుకు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు క్రైస్త‌వ మ‌త పెద్ద‌లు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం..!!

ప‌విత్ర‌గ్రంథ‌మైన బైబిల్ ను అనుస‌రించి క్రైస్త‌వ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారు చెబుతున్న మాట ప్ర‌కారం.. క్రైస్త‌వుల ఆరాధ్య‌దైవం యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డ్డ‌డానికి ముందు త‌న శిష్యుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం స్వీక‌రించారు. అయితే, యేసుక్రీస్తు త‌న శిష్యుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేస్తున్న సమ‌యంలో ప‌ద‌మూడ‌వ శిష్యుడు జుడాస్ ఇస్కారియ‌ట్ వ‌చ్చి చేరారు. యేసుక్రీస్తు శిలువ వేయ‌బ‌డ‌డానికి కార‌ణం జుడాస్ ఇస్కారియ‌ట్ చ‌ర్య‌లేన‌న్న‌ది క్రైస్త‌వ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారు చెబుతున్నారు. యేసు క్రీస్తు భోజ‌నం చేస్తున్న స‌మ‌యంలో 13వ శిష్యుడు జుడాస్ ఇస్కారియ‌ట్ వ‌చ్చి చేర‌డంతో..13వ అనే నెంబ‌ర్‌కు యేసు క్రీస్తు శిలువ‌వేయ‌బ‌డ్డ రోజుకు సంబంధం ఉంద‌న్న‌ది కొంద‌రి న‌మ్మ‌కం.

ఈ న‌మ్మ‌కంతోనే పాశ్యాత్య దేశాల్లో చాలా మంది 13 అనే అంకె అంటేనే భ‌య‌ప‌డుతున్నారు. అంతేకాదు, 13 అనే నెంబ‌ర్‌ను ఏ సంద‌ర్భంలోనూ వాడేందుకు వారు ఇష్ట‌ప‌డ‌టం లేదు. వాహ‌నాల నెంబ‌ర్లు, ఇంటి నెంబ‌ర్లు, వివాహాలు, జ‌ర్నీలు, బ‌హుళ అంత‌స్తుల్లో క‌నిపించే లిఫ్ట్‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి. 1 నుంచి ఎన్ని నెంబ‌ర్లు ఉన్నా.. మ‌ధ్య‌లో 13వ అనే నెంబ‌ర్ మాత్రం క‌నిపించ‌దు. అంతెందుకు అభివృద్ధి ప‌థంలో అన్ని దేశాల‌కంటే ముందున్న అమెరికాలో కూడా ప్ర‌తీ నెలా 13వ తేదీన ఉద్యోగులతోపాటు ప్ర‌జ‌లు వారి విధుల‌కు గైర్హాజ‌రు కావ‌డంతో, వివిధ సంద‌ర్భాల్లో 13వ నెంబ‌ర్ క‌నిపిస్తే ఆ ప‌నుల‌ను వాయిదా వేయ‌డంతో, అమెరికాకు ప్ర‌తీ ఏటా రూ. 54వేల కోట్లు ఆర్థిక న‌ష్టం వ‌స్తోంద‌ని ఓ స‌ర్వే తేల్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat