Breaking News
Home / BAKTHI / ప్ర‌కృతి పుల‌క‌రించేలా యేసుక్రీస్తు రాక‌..!!

ప్ర‌కృతి పుల‌క‌రించేలా యేసుక్రీస్తు రాక‌..!!

అవును, యేసుక్రీస్తు త‌న స‌మాధి నుంచి తిరిగి లేచిన రోజున ప్ర‌కృతి పుల‌క‌రించింది. కాగా, శుక్ర‌వారం రోజున యేసు క్రీస్తు శిలువ వేయ‌బ‌డిన దిన‌ముగా క్రైస్త‌వులు భావించి బ్లాక్ డేగా గుర్తిస్తూ, ఆ రోజున న‌ల్ల దుస్తులు ధ‌రిస్తార‌ని క్రైస్త‌వ ధ‌ర్మం చెబుతోంది. అయితే, మూడు రోజుల్లోనే యేసు క్రీస్తు స‌మాధి నుంచి లేచి ప్ర‌జ‌ల కోసం మ‌ళ్లీ వ‌చ్చారు. దీంతో ప్ర‌కృతి పుల‌క‌రించింది. యేసుక్రీస్తు ఇక‌లేర‌నుకున్న వారి మ‌దిలో సంతోషాలు వెల్లివిరిసాయి.

యేసుక్రీస్తును శిలువ వేసిన త‌రువాత స‌మాధి చేయ‌బడ్డార‌ని, స‌మాధిలో ఉన్న యేసుక్రీస్తు స‌మాధి ప‌రిస‌రాల‌ను శుభ్రం చేయ‌డంతోపాటు.. నీళ్లు చ‌ల్లేందుకు వెళ్లిన ఓ స్ర్తీకి యేసుక్రీస్తు స‌జీవుడై ద‌ర్శ‌న‌మిచ్చారు. అంత‌కు ముందు స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లిన ఆ స్ర్తీకి స‌మాధి త‌లుపులు తెరిచి క‌న‌బ‌డ్డాయి. దీంతో ఆ మ‌హిళ ఆ విష‌యాన్ని త‌న యేసుక్రీస్తు అనుయాయుల‌తో చెప్పింది. దీంతో వారి మ‌ది ఆనందంతో వెల్లివిరిసింది. యేసుక్రీస్తు ఇంకా స‌జీవంగానే ఉన్నాడ‌ని తెలుసుకున్న ప్ర‌జ‌లు ఆ సంద‌ర్భాన్ని పండుగ‌లా జ‌రుపుకున్నారు. ఈ పండుగ పేరే ఈస్ట‌ర్‌. యేసు క్రీస్తు ఎప్పుడూ స‌జీవుడే.