Home / BHAKTHI / ఈస్ట‌ర్ రోజున ”చాకొలెట్ ఈస్ట‌ర్ ఎగ్” త‌యారు చేద్దామిలా..!!

ఈస్ట‌ర్ రోజున ”చాకొలెట్ ఈస్ట‌ర్ ఎగ్” త‌యారు చేద్దామిలా..!!

ఈస్ట‌ర్‌. యేసు క్రీస్తు శిలువ‌వేయ‌బ‌డ్డ (గుడ్‌ఫ్రైడే) రోజు నుంచి మూడు రోజుల్లోనే తిరిగి స‌మాధి నుంచి లేచిన రోజును క్రైస్త‌వ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారు ఈస్ట‌ర్‌గా పండుగ‌గా జ‌రుపుకుంటారు. అయితే, ఈస్ట‌ర్ పండుగ రోజున ఇంటికొచ్చే అతిథుల కోసం ఏదో ఒక తినుబండారాన్ని ఇవ్వ‌డం ఆచారం. యేసుక్రీస్తు స‌మాధి నుంచి లేచి తిరిగి ప్ర‌జ‌ల ర‌క్ష‌ణార్ధంగా భూలోకానికి వ‌చ్చిన రోజుగా జ‌రుపుకునే ఈస్ట‌ర్ పండుగ రోజున.. ఆ శుభ‌వార్త‌ను చెబుతూ ఇంటికి వ‌చ్చిన అతిధుల కోసం ఓ కేక్‌ను మ‌న‌మే త‌యారు చేసి ఇస్తే.. చాకొలెట్ ఈస్ట‌ర్ ఎగ్ త‌యారు చేస్తే.. చాలా బావుంటుంది.

అయితే, ఆ కేక్ త‌యారీ విధానాన్ని ఓ సారి చూద్దాం..!!

కావాల్సిన ప‌దార్థాలు.. త‌యారు చేసిన చాకొలెట్ 400 గ్రాములు, ఎగ్‌మౌల్డ్స్ అచ్చులు. అంత‌కు ముందే త‌యారు చేసిన చాకొలెట్ ప‌దార్థాన్ని వీలైనంత చిన్న‌గా, స‌న్న‌గా క‌ట్‌చేసి ఓ బాండిల్‌లో సంగం వ‌ర‌కు నీరు పోసి,ఆ చాకొలెట్‌ను వేడి చేయాల‌. దీంతో చాకొలెట్ ప‌దార్థం ఆ వేడినీటిలోనే క‌రుగుతుంది. ఆ త‌రువాత బాండిల్‌ను గ్యాస్ పొయ్యిమీద నుంచి దించెయ్యాలి. అనంత‌రం ఆ చాకొలెట్‌ను కాస్త వేడి త‌గ్గే వ‌ర‌కు కింద‌నే ఉంచాలి. అంత‌కు ముందుగా తీసి ఉంచిన ఎగ్‌మౌల్డ్స్‌లో ఒక టీ స్పూన్ ఆ వేడి చేసిన ద్రావ‌ణాన్ని పోసి ఉంచాలి. దీంతో ఎగ్‌మౌల్డ్స్ అన్ని వైపులా ద్రావ‌ణంలా ఆ ప‌దార్థం ఉండిపోతుంది. చ‌ల్లారిన కాసేప‌టి త‌రువాత ఎగ్‌మౌల్డ్స్ ఆకారం వ‌చ్చేందుకు 10 నిమిషాల‌పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే, చాకొలెట్ ఈస్ట‌ర్ ఎగ్ రెడీ అయిపోయిన‌ట్టే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat