Home / MOVIES / అందరికి తెలుసు..రకుల్ ప్రీత్ సింగ్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే..మాధవీలత

అందరికి తెలుసు..రకుల్ ప్రీత్ సింగ్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే..మాధవీలత

సినిమా వాళ్లను ఉద్దేశించి టీవీ 5 జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అన్న పదానికే తావులేదని వ్యాఖ్యానించారు. రకుల్ వ్యాఖ్యలను నటి శ్రీరెడ్డి తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మరో నటి మాధవీలత కూడా స్పందించారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అన్న పదమే లేదని, అవకాశాల కోసం ఎవరూ ఏమీ త్యాగాలు చేయడం లేదని, హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎదురు అవుతున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలను హీరోయిన్ మాధవీలత తీవ్రంగా తప్పుబట్టింది. రకుల్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, టాలీవుడ్‌లో హీరోయిన్లకు వేధింపులు నిజమని, అయితే, అవకాశాలు దక్కవనే భయంతో ఎవరూ మాట్లాడరని వ్యాఖ్యానించింది. కాస్టింగ్ కౌచ్‌ను ఎలా నిరోధించాలలో ఆలోచించాల్సిన సమయంలో, ఆ సంస్కృతే లేదని చెప్పడం చాలా తప్పని అన్నారు.

సినీ అభిమానులను, ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికే రకుల్ ఈ అబద్ధాలు చెప్పినట్టుందని మాధవీలత అభిప్రాయపడింది. మహిళలను తప్పుగా చూడటం, వేధించడం సమాజంలో ప్రతీ చోట, ప్రతీ రంగంలోనూ ఉంది.. సినిమాల్లో నేను అలాంటివి చూడలేదని, వినలేదు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. రకుల్ ప్రీత్ మాట్లాంది చాలా తప్పని, ప్రతీ చోట క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ లేదని చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.

Posted by Actress Maadhavi on Tuesday, 27 March 2018

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat