ఎస్బీఐ శుభవార్త ..! – Dharuvu
Home / BUSINESS / ఎస్బీఐ శుభవార్త ..!

ఎస్బీఐ శుభవార్త ..!

దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది.అందులో భాగంగా తమ సంస్థ నుండి గృహ రుణాలను తీసుకునేవారికి తీపి కబురును అందించింది.ఈ క్రమంలో ఈ నెల ముప్పై ఒకటో తారిఖు వరకు తీసుకునే గృహ రుణాలపై ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.

ఈ విషయం గురించి తమ సోషల్ మీడియాలో అధికారక పేజీ అయిన ట్విట్టర్ లో వెల్లడించింది.అంతే కాకుండా ఆకర్షనీయమైన వడ్డీరేట్లు కూడా ఉంటాయని ఆ సంస్థ తెలిపింది.మిగత సమాచారానికి దగ్గరలోనే తమ బ్యాంకులను సంప్రదించాలని ట్విట్టర్ లో పేర్కొన్నది .