Breaking News
Home / SLIDER / హువావే హానర్ 7ఎ స్మార్ట్‌ఫోన్ రేపే విడుదల..!!

హువావే హానర్ 7ఎ స్మార్ట్‌ఫోన్ రేపే విడుదల..!!

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎ ను సోమవారం విడుదల చేయనుంది. అయితే ప్రస్తుతం ఇంకా దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌లో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

హానర్ 7ఎ ఫీచర్లు…

 • 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
 • 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 • 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్
 • 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్
 • 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 • ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
 • డ్యుయల్ సిమ్
 •  13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
 • ఫింగర్‌ప్రింట్ సెన్సార్
 • 4జీ వీవోఎల్‌టీఈ
 •  బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.