టీడీపీ పార్టీ చంద్రబాబు సొత్తు కాదు..!! అవును, టీడీపీ చంద్రబాబు సొత్తు కాదు, నాడు సీనియర్ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మరీ చంద్రబాబు టీడీపీని లాక్కున్నారు. ఇక అప్పట్నుంచి సీనియర్ రామారావు వారసులైన బాలకృష్ణ, హరికృష్ణలను రాజకీయంగా చంద్రబాబు తొక్కేశారు. సీనియర్ రామారావు మనవళ్లను కూడా చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చాణుక్యతతో అణగదొక్కారు. ఇప్పటికైనా జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి. జూ.ఎన్టీఆర్ మాటలు స్టార్ట్ చేస్తే ఆపడు. 2014 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో కంటిన్యూ అవుతారని భావించా.. కానీ అలా జగరకుండా చంద్రబాబు అడ్డుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సినీ నటి మాధవీలత.
కాగా, పై అంశాలనే మాధవీలత తన సోషల్ మీడియాఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మాధవీలత ఇప్పుడు రాజకీయాలపై మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికైనా ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉండాలన్న అభిప్రాయాన్ని తెలిపింది. సీనియర్ ఎన్టీఆర్లానే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేస్తాడని భావిస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది మాధవీలత.