శరీరాన్ని ఆయిల్ తో మర్ధన చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!! – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / శరీరాన్ని ఆయిల్ తో మర్ధన చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!

శరీరాన్ని ఆయిల్ తో మర్ధన చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!

నువ్వుల నూనె ,కొబ్బరి నూనె ,ఆముదం ,ఆవు నెయ్యి మరియు ఇతర ఔషధ గుణాలున్న తైలంతో తల ,శరీరం అంతట మర్ధన చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు .కనీసం వారంలో ఒక్కసారైనా ఆయిల్ తో మర్ధన చేసుకుంటే కలిగే లభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తైలంతో తలకు మర్ధన చేసుకోవడం వలన కంటి,జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గు ముఖం పడతాయి.జుట్టుకు నూనెను అప్లయ్ చేసి మృదువుగా మసాజ్ చేయడం ద్వార రక్త ప్రసరణ భాగా జరిగి తల వెంట్రుకలు వృద్ది చెందుతాయి .తలనొప్పి కూడా తగ్గు ముఖం పడుతుంది.

నూనెతో శరీరాన్ని మర్ధన చేసుకోవడం వలన శరీరం కాంతి వంతంగా మారుతుంది.శరీర మర్ధన వలన శరీరం నుండి మలినాలు విసర్జింపబడి చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది.అరికాళ్ళకు నూనె తో మర్ధన చేయడం వలన అరికాళ్ల మంటలు తగ్గుతాయి.కండ్ల వేడి తగ్గి కండ్లు చల్లబడుతా యి.పాదాల పగుళ్ళు కూడా తగ్గిపోతాయి.

శరీరంలోని రక్తనాళాలు మరియు గ్రంధులపై మర్ధన జరగడం వలన శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.అన్ని అవయవాలకు రక్తప్రసరణ భాగా జరిగి శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు బయటకు విసర్జింప బడుతాయి.తైలంతో మర్ధన చేయడం వలన అవయవాల ఆకారం మరియు వాటి పనితీరు మెరుగుపడుతుంది.శరీరక మరియు మానసిక వ్యవస్థలు ఆరోగ్యవంతంగా అవుతా యి.

శరీరక మరియు మానసిక అలసట దూరం అవుతుంది.పొట్ట ,శరీర భాగాలూ మర్ధన చేయడం వలన కొవ్వు కరిగి ,శరీరం బయటకు విసర్జింప బడటమే కాకుండా మలబద్దక సమస్య తగ్గి ,అధిక బరువు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.అంతేకాకుండా చర్మం మృదువుగా అందంగా మారి,వయస్సు మీద పడటం వలన వచ్చే ముడతలు ,మచ్చలు తగ్గుతాయి.