Home / SLIDER / చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్….!

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్….!

ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు .ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన చరిత్రను తన సొంతం చేసుకున్నాడు .ఈ రోజు ఆదివారం బింద్రా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 166పరుగులను సాధించింది .లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ అసలు సింగిల్స్ జోలికి పోకుండా కేవలం బౌండరీస్ ,సిక్స్ ల మీద ఆధారపడి కేవలం పద్నాలుగు బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు .ఆరు ఫోర్లు,నాలుగు సిక్స్ లతో పద్నాలుగు బంతుల్లో 364స్ట్రైక్ తో ఐపీఎల్ లోనే అత్యంత వేగమైన అర్ధశతాకాన్ని సాధించిన క్రికెటర్ గా ప్రపంచ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు యూసుఫ్ పఠాన్ పేరు మీద పదిహేను బంతుల్లో అర్ధశతక రికార్డును బద్దలు కొట్టి అత్యంత వేగంగా అర్ధశతాకాన్ని సాధించనవారిలో నాలుగో స్థానంలో నిలిచాడు రాహుల్ ..