నింగినంటిన పసిడి ధర …! – Dharuvu
Home / BUSINESS / నింగినంటిన పసిడి ధర …!

నింగినంటిన పసిడి ధర …!

ఇంటర్నేషనల్ మార్కెట్లో చోటు చేస్కున్న పరిణామాలతో పసిడి ధర ఆకాశాన్ని తాకింది .అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ పరిణామాలతో పాటుగా అక్షయ తృతీయ కూడా దగ్గరకు వస్తుండటంతో బంగారం ధరకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు బుధవారం ఒక్కరోజే దాదాపు మూడు వందల రూపాయలకు పెరిగింది బంగారం ధర .బులియన్ మార్కట్లో పది గ్రాముల పసిడి ధర రూ.ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాబై రూపాయలకు చేరింది .వెండి ధర మూడు వందల అరవై కు పెరిగి కేజీ వెండి ధర మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడువందల అరవై రూపాయలకు చేరింది ..