సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పిండ్రు..!! – Dharuvu
Breaking News
Home / EDITORIAL / సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పిండ్రు..!!

సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పిండ్రు..!!

పర్యావరణ హితానికి మాత్రమే వినియోగించాల్సిన కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా ) నిధులు ఢిల్లీలోని ఒక బ్యాంకు లో మూలుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో చెప్పారు . పర్యావరణ హితం కోసం ఖర్చు చేయాల్సిన ఆ నిధులను ఆయా రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వకుండా విపరీతమైన జాప్యం జరుగుతున్నదని చాలా కాలం క్రితమే అయన మీడియా ముందే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు . తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్లాది మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టిందని దీనికి కేంద్రం నుండి రావాల్సిన కాంపా నిధులను విడుదల చేయమని ప్రధానికి , మంత్రులకు , అధికారులకు లేఖల మీద లేఖలు రాయాల్సి వస్తున్నదని సీఎం కేసీఆర్ గతంలో ఒక ప్రెస్ మీట్ లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు .

అన్ని రాష్ట్రాలకు సంబందించిన సుమారు లక్ష కోట్లు ఢిల్లీ లోని ఒక బ్యాంకు లో మూలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు . అసలు చాలా రాష్ట్రాల వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే వరకు తమ రాష్ట్రాలకు రావాల్సిన కాంపా నిధులు ఢిల్లీలోని ఒక బ్యాంకు లో ఉన్న విషయం తెలియని పరిస్థితి . అయితే ఆ కాంపా నిధులు పక్కదారి పడుతున్నాయనే విషయం తాజాగా సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది . ఈ విషయంలో సుప్రీం కేంద్రం వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్నే వ్యక్తం చేసింది . ఇందులో కాంపా నిధులతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యావరణ హితం కోసం చర్యలు తీసుకోకపోవడంలో కేంద్రం నిర్లక్ష్యం చేయడం ఒక కారణమైతే , ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం ఇంకా వివాదాస్పద మవుతున్నది . ప్రపంచంలో మూడో అతి పెద్ద ప్రయత్నంగా … తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ రిజ్వోనేషన్ చేయడంతో పాటు కోట్లాది మొక్కలను నాటిస్తున్నది . దేశంలో భారీగా మొక్కలు నాటిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి పార్లమెంట్ లోనే ప్రకటించారు . అలాంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోగా రావాల్సిన కాంపా నిధులు కూడా విడుదల చేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నది . ఇప్పుడు ఏకంగా ఈ అంశమే సుప్రీం ముందుకు వచ్చింది . ఇక ముందైనా కేంద్రం వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి .