50ఏళ్ళల్లో చేయని అభివృద్ధి 4ఏళ్ళలో మోదీ చేశారు -దత్తాత్రేయ ..! – Dharuvu
Breaking News
Home / NATIONAL / 50ఏళ్ళల్లో చేయని అభివృద్ధి 4ఏళ్ళలో మోదీ చేశారు -దత్తాత్రేయ ..!

50ఏళ్ళల్లో చేయని అభివృద్ధి 4ఏళ్ళలో మోదీ చేశారు -దత్తాత్రేయ ..!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీ ,కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇచ్చిన ఒకరోజు అమరనిరహర దీక్ష సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రజాస్వామ్య
పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు యాబై ఏళ్ళు చేయని అభివృద్ధి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోదీ నాలుగు ఏళ్ళల్లోనే చేశారు అని ఆయన అన్నారు .దేశాన్ని బంగారు దేశంగా తీర్చిదిద్దటానికి ప్రధాని మోదీ బేటీ బచావో బేటీ పడావో ,స్వచ్ఛ భారత్ ,జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి నిర్ణయాలను తీసుకున్నారు అని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు .అయితే ఇటివల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరుకు నిరసనగా ప్రధాని ఒకరోజు దీక్షకు పిలుపునిచ్చిన సంగతి విదితమే .