Breaking News
Home / ANDHRAPRADESH / కడప లో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..!

కడప లో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..!

గత నాలుగేళ్లుగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను కడపజిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుమన్నమలై జిల్లా ఆరణి గ్రామానికి చెందిన సత్యనారాయణ గడచిన కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకొని కడపజిల్లా నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించినట్టు వెల్లడయింది. సత్యనారాయణ కు దుబాయ్ కి చెందిన అలీభాయ్.. షాజీ వంటి బడా స్మగ్లర్ లతో సంబంధాలున్నాయని ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా ఇతనికి అంతర్జాతీయ స్మగ్లర్ సునీల్ అలియాస్ ఆర్కాట్ భాయ్ కి ప్రధాన అనుచరుడని వివరించారు. సత్యనారాయణను అతని స్వగ్రామం లో అరెస్టు చేయడంతో పాటు అతని నుంచి 30 ఎర్రచందనం దుంగలు 11 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు.