Breaking News
Home / ANDHRAPRADESH / షాక్ న్యూస్.. అనంతపురం కోచింగ్‌ సెంటర్‌లోని అమ్మాయిల బాత్రూమ్‌ల్లో ఏం చేస్తున్నారో తెలుసా

షాక్ న్యూస్.. అనంతపురం కోచింగ్‌ సెంటర్‌లోని అమ్మాయిల బాత్రూమ్‌ల్లో ఏం చేస్తున్నారో తెలుసా

దేశంలో ఇలాంటి న్యూ సేన్సులు రోజురోజుకు ఎక్కువైపోతున్నయి. మహిళకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైపోతుంది. ఆడపిల్లకి ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందో అని తల్లిదండ్రులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో కామంధుల సంఖ్యా రోజురోజుకు పెరుగుతుంది కాబట్టి. అసలిప్పుడు ఇవన్ని ఎందుకు మాట్లాడుకుంటున్నమంటే .. కోచింగ్‌ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయి. వేలాది రూపాయల కొద్ది దండుకునే కోచింగ్‌ సెంటర్లు మరింత రెచ్చిపోయి భద్రత పేరుతో అకృత్యాలు చేస్తున్నాయి. మహిళల బాత్రూమ్‌లో రహస్య కెమారాలు పెట్టి దారుణాలకు పాల్పడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని లోటస్‌ కోచింగ్‌ సెంటర్‌ చేస్తున్న నిర్వాకం బయటపడింది. కోచింగ్‌ సెంటర్‌లోని మహిళల బాత్రూమ్‌ల్లో రహస్య కెమరాలు పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నారు. అయితే విషయం తెసుకున్న మహిళలు విద్యార్థులు ఈ దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలియచేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రలు కోచింగ్‌ సెంటర్‌పై దాడలకు దిగారు. చదువు చెప్పాల్సింది పోయి.. ఇలాంటి పనులు చేయడం ఏంటని నిలదీశారు. కోచింగ్ సెంటర్‌ నిర్వాహకుడు సంజీవరాయుడుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.