Breaking News
Home / ANDHRAPRADESH / 40ఏళ్ళ అనుభవమున్న బాబు చేయలేనిది జగన్ చేయబోతున్నాడు …!

40ఏళ్ళ అనుభవమున్న బాబు చేయలేనిది జగన్ చేయబోతున్నాడు …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారా ..ఇప్పటికే రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర సర్కారు యూపీఏ ఇచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలతో పాటుగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా ..ఏపీ ప్రజలను మోసం చేస్తున్న ప్రస్తుత కేంద్ర సర్కారు ఎన్డీఏ పై
వరసగా పదమూడు రోజులు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన జగన్ ఏకంగా వైసీపీ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీల చేత రాజీనామా చేయించిన జగన్ తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారు.అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ ఎంపీల చేత ఈ నెల ఆరో తారీఖున రాజీనామా చేయించిన జగన్ బీజేపీ నేతలతో కుమ్మక్కై తమ ఎంపీలరాజీనామాలనుఆమోదించకుండా చూసుకుంటున్నాడు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే .

అయితే టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి ..ఏపీ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేయడానికి తన పార్టీకి చెందిన నలబై నాలుగు (ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి విదితమే )మంది ఎమ్మెల్యేల చేత మూకుమ్మడిగా రాజీనామా చేయించాలని నిర్ణయం తీసుకున్నారు అంట . అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన రాజీనామాల అస్త్రాన్ని ఉపయోగించుకోవాలని జగన్ ఆలోచిస్తున్నాడు అంట .అప్పట్లో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పలుమార్లు తమ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి పలు సార్లు ఉప ఎన్నికలకు వెళ్లి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలిసేలా చేశారు.అదే విధంగా ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును మార్చే ప్రత్యేక హోదా ఆకాంక్షను ఢిల్లీలోని పెద్దలకు తెలిసేలా చేయాలనీ ..అందుకు రాజకీయ పునరేకీకరణ మార్గమని నమ్మిన జగన్ త్వరలోనే తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఇప్పటికే ఎంపీల చేత రాజీనామాలు చేయించి దేశ రాజకీయాలను ఏపీ వైపు చూసేలా చేసిన జగన్ తాజాగా తీసుకునే ఈ నిర్ణయంతో అధికార టీడీపీ పార్టీ నేతల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కేవలం స్వార్ధ రాజకీయాల కోసమే టీడీపీ వాడుకుంటుందని ప్రజలు అనుకుంటున్నా తరుణంలో ఏకంగా ఎమ్మెల్యేల చేత వైసీపీ అధినేత రాజీనామా చేయించాలని అనుకోవడం పెను సంచలనానికి దారి తీస్తుంది అని..ఇప్పటికే ఎంపీల చేత రాజీనామాలు చేయించకుండా ప్రజల్లో దోషులుగా నిలబడిన తాము జగన్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే తాము చేయకుండా ఉంటె ఉన్న కాస్త ఇజ్జతు కూడా పోతుందని  టీడీపీ  వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో వైసీపీ అధినేత తీసుకునే నిర్ణయం ఇటు పార్టీకి అటు ఏపీ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా ఢిల్లీ పెద్దలకు తెలుస్తుంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి .చూడాలి మరి ఎంపీల చేత రాజీనామా చేయించి దేశ రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించిన జగన్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి రాష్ట్ర రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పుతారో ..!