Home / MOVIES / వెయ్యి రూపాయల కోసం పడుకునే మనస్తత్వం మాది కాదు..!!

వెయ్యి రూపాయల కోసం పడుకునే మనస్తత్వం మాది కాదు..!!

తెలుగు సినీరంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక దోపిడీపై పోరాడుతున్న తమపై సానుభూతి చూపించకపోయినా పర్వాలేదు కానీ దయచేసి బూతు మెసేజ్‌లు,కామెంట్లు మాత్రం పెట్టొద్దని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ కోరారు .తెలుగు సినీ ఇండస్ట్రీలో నాకు అన్యాయం జరిగింది అని ఒక అమ్మాయి బయటికి వస్తే ఆమె పై సానుభూతి చూపాల్సింది పోయి.. ఆమెపై బూతు కామెంట్లా. వెయ్యి రూపాయల కోసం పడుకునే మనస్తత్వం మాది కాదు. ఆ పడుకునే అలవాటే ఉంటే ఆ వెయ్యి రూపాయల కోసం ఇంకో ఎవడితోనైనా పడుకుంటుంది. అమ్మాయిలు ఇంతగా బాధపడుతుంటే ఈ సమాజంలో ఉన్నాం కనీసం మద్దతు తెలుపుదాం అని ఎవరికీ లేదు.కనీసం ఒక కాకికి దెబ్బ తగిలితే పది కాకులు వస్తాయి.. అలాంటిది ఒక అమ్మాయి బాధపడుతుంటే కనీసం పక్కనోళ్లు వచ్చి సపోర్ట్ చేయకుండా ఏంటండి మాట్లాడతారు’ అని అపూర్వ భావోద్వేగానికి గురయ్యారు.

‘పడుకున్నప్పుడు మీకు తెలీదా.. పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది.. అని కామెంట్లు చేస్తున్నారు. ఎవరికండి బాగుంటుంది. మనకు నచ్చని వ్యక్తి పక్కన కూర్చుంటేనే యాక్సెప్ట్ చేయలేం. అలాంటిది ఒక అరవయ్యేళ్లు, డబ్బైయ్యేళ్లు వచ్చి.. వాడి దగ్గర చెమట కంపేరాని, ఇంకోటి రాని.. ఎందుకండి వెయ్యి రూపాయల కోసం ఇంత మంది చేతుల్లో నలగాలా? అని ఈ చర్చలో అపూర్వ తన ఆవేదన్య వ్యక్తం చేసింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat