Breaking News
Home / BUSINESS / వెలుగులోకి వచ్చిన మరో బ్యాంకు కుంభకోణం ..!

వెలుగులోకి వచ్చిన మరో బ్యాంకు కుంభకోణం ..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏదో ఒక చోట ఏదో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి రావడం మనం గమనిస్తూనే ఉన్నాము .ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యా దగ్గర నుండి నిన్నటి పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణంలో ప్రధాన పాత్ర ఉన్న నీరవ్ మోదీ వరకు అనేక సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము .

తాజాగా మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .దాదాపు ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల మోసానికి యూకో బ్యాంకు మాజీ ఛైర్మన్ అరుణ్ కౌల్ తో పాటు మరికొంతమంది పాల్పడ్డారు అని సీబీఐ కేసులను నమోదు చేసింది.ప్రేవేటు ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ సంస్థ ఎరా ఇంజనీరింగ్‌ ఇఫ్రా లిమిటెడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ అల్‌టియస్‌ ఫిన్‌సర్వ్‌ ప్రైవేటు లిమిటెడ్‌లకు రుణాల చెల్లింపు విషయంలో అరుణ్‌ కౌల్‌ అవతవకలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.