బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధుపై సైనా గెలుపు – Dharuvu
Breaking News
Home / SLIDER / బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధుపై సైనా గెలుపు

బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధుపై సైనా గెలుపు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌లో స్వర్ణం దక్కింది. బ్యాడ్మింటన్ ఫైనల్ లో భాగంగా భారత ఏస్ షట్లర్లు సింధు, సైనా తలపడ్డారు. హోరోహోరీగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో సైన నెహ్వాల్ విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తించిన ఈ గేమ్ లో ఇరువురూ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడారు. చివరికి సైనా నెహ్వాల్ 21-18, 23-21 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.