హైదరాబాద్‌లో మరో బ్యూటీషియన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి..! – Dharuvu
Breaking News
Home / CRIME / హైదరాబాద్‌లో మరో బ్యూటీషియన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి..!

హైదరాబాద్‌లో మరో బ్యూటీషియన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి..!

బాగ్య నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష కేసు అప్పట్టో తీవ్ర కలకలం రేపింది. శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు పెద్ద సంచలనంగా మారింది. తాజాగ నగరంలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఓ యువతి వికారాబాద్‌లో శవమై తేలింది. అనుమానాస్పద స్థితిలో రైలు నుంచి పడి మృతి చెందింది. లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి తాండూరులో అమ్మమ్మ వాళ్లింటికి జాతరకని బీజాపూర్ రైలులో బయలుదేరింది. ధారూర్ మండలం మైలారం వద్ద ఆదివారం (ఏప్రిల్ 15) రాత్రి రైలు నుంచి కిందపడిపోయింది. సోమవారం ఉదయం రైలు పట్టాల పక్కన యువతి పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. కొన ఊపిరితో ఉన్న జ్యోతిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. జ్యోతి స్వస్థలం యాలాల్ మండలం పగిడాల్ గ్రామం. తల్లి కాశమ్మ, తండ్రి మల్లికార్జున్‌తో కలిసి ఆమె తాండూర్‌లో నివాసం ఉంటుంది. జాతరకని బయలుదేరిన తమ కూతురు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అయితే జ్యోతిపై ఎవరైనా దుండగులు బలత్కారానికి ప్రయత్నించి రైలు నుంచి తోసేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె ఫోన్ మైలారం సమీపంలో దొరికినట్లు వారు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు. జాతరకని బయలుదేరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువతి ఫోన్ మైలారం సమీపంలో దొరికినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని జ్యోతిది హత్యా? ఆత్మహత్యా? ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడిపోయిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు