ఉద్యమనేతగా జూనియర్ ఎన్టీఆర్ ..! – Dharuvu
Breaking News
Home / MOVIES / ఉద్యమనేతగా జూనియర్ ఎన్టీఆర్ ..!

ఉద్యమనేతగా జూనియర్ ఎన్టీఆర్ ..!

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటే నందమూరి అభిమానులకు ,తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక ఊపు వస్తుంది.తన నటనతో ..యాక్షన్ తో కొన్ని లక్షలమంది అభిమానులను తన సొంతం చేస్కున్నాడు జూనియర్ .తాజాగా జూనియర్ పుట్టిన రొజూ మరికొద్ది రోజుల్లో రానున్నది.

మే నెల ఇరవై తారీఖున జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు.అయితే తమ అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్భంగా ఏదోక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు జూనియర్ అభిమానులు .అనుకున్నదే తడవుగా ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన మంచి పవర్ ఫుల్ ..సందేశాత్మక చిత్రాల నుండి మెయిన్ మెయిన్ పాయింట్స్ తీసుకొని ఆ మూవీల గొప్పదనాన్ని ..పాత్రల విశేషాలను తెలియజేస్తూ ముప్పై ఐదు పేజిలుండే విధంగా ఒక బుక్ ను రీలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .అందులో భాగంగా “విద్యకు ఉద్యమించిన సాంబశివుడు ఎన్టీఆర్ అంటూ సాంబ మూవీకి సంబంధించిన పాత్ర గురించి ఒక పేజి ను రీలీజ్ చేశారు .అయితే ఎన్టీఆర్ కెరీర్లోనే ఇలా చేయడం మొదటిసారి ..